Telangana: బొంగులో కల్లు...తాగేందుకు స్థానికుల ఆసక్తి!
Telangana: ఆ కల్లును తాగేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు
Telangana: బొంగులో కల్లు తాగాలనుకుంటున్నారా? అయితే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేటకు వెళ్లాల్సిందే. అవును... అక్కడి గీత కార్మికులు కల్లును తీయడానికి కుండలకు బదులుగా వెదురు బొంగులను వాడుతున్నారు. ఆ కల్లును తాగేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
బొంగులో చికెన్ అంటే అరకు గుర్తొస్తుంది. అలానే బొంగులో కల్లు అంటే ఇకపై తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్తొస్తుందేమో! ఇదేంటి బొంగులో కల్లు కూడా ఉంటుందా అనుకుంటున్నారా. అయితే పలిమెల మండలం సర్వాయిపేటకు వెళ్లాల్సిందే.
తెలంగాణ గ్రామాల్లో కల్లుకు చాలా ప్రత్యేకత ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రజలకు మీ ఇంటికి వస్తాను కల్లు గుడాలతో దావత్ ఇవ్వాలని చెపుతుంటారు. దీన్ని బట్టి తెలుస్తుంది కల్లుకు ఉన్న ప్రత్యేకత ఏంటో. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఈ కల్లుకు పురాణాల నుంచి చరిత్ర ఉంది. అంతేకాదు కల్లులో అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.
కల్లు సహజంగా తాటిచెట్టు, ఇతచెట్టు నుండి లభిస్తుంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేటలో కొందరు వినూత్న పద్దతిలో తాటికల్లు తీస్తున్నారు. కల్లును తీయడానికి కుండలను వాడడం లేదు. వాటికి బదులుగా వెదురు బొంగులను వాడుతున్నారు. దీంతో అది బోంగులో కల్లు అయ్యింది. కల్లును తాగడానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.