కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు : పద్మారావు

Update: 2021-01-21 10:14 GMT

కేటీఆర్ సీఎం కావాలంటూ ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో అతిపెద్ద రాజకీయ కీలక పరిణామానికి ఫిబ్రవరి నెల సాక్షి కాబోతోందని తెలుస్తోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ కేటీఆర్‌ సీఎం కావాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని మరింత స్పష్టం చేశారు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్. కేటీఆర్‌ సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పద్మారావు మాట్లాడుతూ.. కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. త్వరలోనే ఆయన సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హ‌త‌లు ఉన్నాయ‌ని మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి పేర్కొన్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News