CM Revanth Reddy: మన విద్యా విధానం ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది
పౌరసమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నాచౌక్ ను తెరిచాం ప్రజాభవన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది పేర్కొన్నారు. ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితి పై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని తెలియజేశారు.