ఉస్మానియా ఆసుపత్రి పనికిరాదు.. హైకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక
Osmania Hospital: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి పనికి రాదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది.
Osmania Hospital: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి పనికి రాదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. మరమ్మతులు చేసినా ఆస్పత్రి అవసరాలకు పనికిరాదని కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుత భవనాన్ని ఆస్పత్రిగా వాడాలంటే ఆక్సిజన్, మంచినీరు, సివరేజీ, గ్యాస్ పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందని కమిటీ సూచించింది. ఒకవేళ ఆస్పత్రికి అవసరమైన మరమ్మతులు చేస్తే హెరిటేజ్ కట్టడం దెబ్బతింటుందని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. కమిటీ రిపోర్టును హైకోర్టుకు సమర్పించించారు అడ్వొకేట్ జనరల్. అయితే నిపుణుల కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు గడువు కావాలని ఏజీ కోరారు. నివేదికపై పిటిషనర్లు అధ్యయనం చేశాకే విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది హైకోర్టు.