Kamareddy News Today: కామారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ మోసం

Kamareddy News Today: * లోను ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తికి రూ.41 వేలు టోకరా * కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్‌లో ఘటన

Update: 2021-08-28 09:12 GMT

కామారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్ మోసం

Kamareddy News Today: ఆన్‌లైన్ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది మాత్రం అదే రీతిన ప్రవర్తిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు బారిన పడి మోసపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. లోను ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర 41 వేల రూపాయలు వసూలు చేశాడు.. మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే జాదవ్ రాహుల్ కు ఈనెల 18న ఆదిత్య బిర్లా కంపెనీ పేరు మీద 50వేల రూపాయలు వస్తుందని ఫోన్ చేసి చెప్పారు. దాంతో రాహుల్ ఆన్‌లైన్ లో వచ్చిన నెంబర్‌కు కాల్ చేశాడు. ఆధార్, పాన్ కార్డు వివరాలు తెలిపాడు. లోన్ అప్రూవల్ అయిందని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. రాహుల్ నుంచి విడతల వారీగా 41 వేల రూపాయలు పీటీఎం ద్వారా వేయించుకున్నారు. తిరిగి మరో 21 వేల రూపాయలు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన రాహుల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News