పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న పిల్లల ఆన్లైన్ చదువులు

Update: 2020-09-15 06:27 GMT

కరోనా వైరస్ పేద, మధ్య తరగతి కుటుంబాలల్లో కొత్త సవాల్ విసురుతోంది. చేసేందుకు పని లేక, తినడానికి తిండి లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆన్లైన్ చదువుల మరింత ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కరోనా కారణంగా ఇంట్లోనే మోగుతున్న బడిగంటతో తల్లిదండ్రలు హడలిపోతున్నారు.

అసలే లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభిస్తుండటంతో పిల్లల కోసం సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు కొనాల్సి వస్తోంది. ఇద్దరు పిల్లలున్న వారికి రెట్టింపు ఖర్చు. వీడియోల కోసం అదనంగా బ్లూటూత్‌ స్పీకర్లు కొంటున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. తోటి విద్యార్థులతో చదువుల పోటీలో తమ పిల్లలు వెనుకబడకూడదన్న ఉద్దేశంతో పేద, మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలకు ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు సెల్‌ఫోన్లు, ట్యాబ్ లు కొనాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇంటర్ నెట్ బిల్ కూడా సమస్యగా మారిందంటున్నారు.

ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు ప్రత్యామ్నాయంగా సెకండ్ హ్యండ్ ఫోన్లు కొని రిపేర్‌ చేయించుకుంటున్నారు. దీంతో పని ఒత్తిడి ఉండటంతో ఫోన్లను రిపేర్ చేసేందుకు ఒక రోజు గడుపు తీసుకుంటున్నామని షాపు యజమానులు చెబుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ క్లాసులు తమకు ఆర్థం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటికే లాక్‌డౌన్‌తో పనులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు పిల్లల ఆన్‌లైన్‌ చదువులు ఆర్థికంగా మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

Tags:    

Similar News