Nagarjuna Sagar: బీజేపీ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
Nagarjuna Sagar: సాగర్ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న చర్చలు * ఆశావాహులతో చర్చించిన బండి సంజయ్
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక కోసం.. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆశావాహులతో చర్చలు జరుపుతున్నారు. నివేదితరెడ్డి, కడారి అంజయ్య, ఇంద్రసేనరెడ్డి, రవి నాయక్ తో వేరు వేరుగా మాట్లాడారు బండి సంజయ్. పార్టీ అధికారికంగా ఎవరిని ప్రకటించకపోయినా నివేదిత రెడ్డి మాత్రం బీజేపీ తరుపున ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.
సాగర్ అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ సీనియర్లతో పాటు నియోజకవర్గ నేతల నుంచి బండి సంజయ్ అభిప్రాయాలు సేకరిస్తు్న్నారు. మరోవైపు, బీజేపీ టీఆర్ఎస్ అసంతృప్తులపైనే ఆశలు పెట్టుకుంది. అందుకే, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన కోసం వేచి చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించడంతో టీఆర్ఎస్ ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తుందోనని వేచి చూస్తోంది. టీఆర్ఎస్ ప్రకటనను బట్టి, తాము వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాలని కమలం పార్టీ భావిస్తోంది.