MLC Elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

MLC Elections 2021: ఆసక్తిగా మారుతున్న ఎమ్మెల్సీ ఫలితాలు * కీలకంగా మారనున్న రెండో ప్రాధాన్యత ఓట్లు

Update: 2021-03-19 04:48 GMT

ఫైల్ ఇమేజ్ 

 MLC Elections 2021: నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటుపై ఏ అభ్యర్థికి 51శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే లక్షా 83 వేల 167 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే.. మొదటి ప్రాధాన్యతలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌ రెడ్డికి లక్షా 10వేల 8వందల 40 ఓట్లు వచ్చాయి. పల్లా గెలవాలంటే ఇంకా 72వేల 3వందల 27 ఓట్లు కావాల్సి ఉంటుంది.

అదే విధంగా రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఆయనకు ఏడు రౌండ్లు కలిపి 83వేల 2వందల 90 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు 99వేల 877 ఓట్లు కావల్సి ఉంది.. మూడో స్థానంలో ఉన్న కోదండరామ్‌కు 70వేల 72 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు కావల్సినవి లక్షా 13వేల 95 ఓట్లు కావాల్సి ఉంది. దీంతో ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. 

Tags:    

Similar News