GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు

GHMC: తెలంగాణలో కొత్తగా 2వేల 447 కొవిడ్ కేసులు

Update: 2022-01-18 03:41 GMT

 జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు

GHMC: తెలంగాణ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగోతోంది. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం ఈ వేరియంట్‌వేనని తేటతెల్లమైంది. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 90 నమూనాలను పంపించగా.. వాటిలో 7 శాతం మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసులు కాగా 83 పాజిటివ్‌లు ఒమిక్రాన్‌కు సంబంధించినవని నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌లోనూ బిఎ1కు చెందినవి 15, బిఎ2కు చెందినవి 64, చెందినవి గా వెల్లడైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో బిఎ2 రకం ఒమ్రికాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఒమిక్రాన్‌ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు. కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియాలో పాజిటివ్‌ వచ్చిన వైద్య సిబ్బందికి గతంలో 15 రోజుల సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం వారానికి కుదిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో కొత్తగా 2వేల, 447 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షల,11వేల, 656కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 3 మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 4వేల, 60 మంది కన్నుమూశారు. వైరస్‌ బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 2వేల, 295 మంది కోలుకోగా మొత్తంగా 6లక్షల, 85వేల, 399 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News