Jurala Dam: నిండుకుండలా జూరాల ప్రాజెక్టు.. 2 గేట్లు ఎత్తిన అధికారులు
Jurala Dam: జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 42,000 క్యూసెక్కులు
Jurala Dam: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 42వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాతుండగా.. 54 వేల 468 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 9.111 టీఎంసీలకు చేరింది.