మరోసారి సంచలనంగా మారిన ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం.. భూములు స్వాధీనం చేసుకుంటామని నోటీసులు

Jeevan Reddy Mall: మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం సంచలనంగా మారింది.

Update: 2024-10-22 05:22 GMT

మరోసారి సంచలనంగా మారిన ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం.. భూములు స్వాధీనం చేసుకుంటామని నోటీసులు

Jeevan Reddy Mall: మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం సంచలనంగా మారింది. మాల్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పును తీర్చకుంటే.... తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు ఇచ్చారు. మాల్ నిర్మాణం కోసం ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద 45 కోట్ల 46 లక్షల 90 రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

అప్పును వడ్డీతో సహా చెల్లించకుంటే షూరిటీ ఇచ్చిన వారి భూములను సైతం స్వాధీనం చేసుకుంటాన్నారు. షూరిటీ ఇచ్చిన ఆశన్నగారి రాజన్న, గంగారెడ్డి, నరేందర్, లక్ష్మణ్‌ల భూముల వద్ద సైతం నోటీసులు ఇచ్చారు అధికారులు.

కాగా జీవన్ మాల్ కు గతంలో ఇంతకుముందు ఆర్టీసీకి బకాయి పడ్డ కిరాయి డబ్బులు, విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ.. నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో మారు సోమవారం స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ అధికారులు బకాయిలు చెల్లించాలంటూ.. షూరిటీ దారులకు, వారి భూములను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేయడం పట్ల చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News