పశువులపై ఆగని పులల దాడి

Tiger attack: పశువుల మందపై పులి దాడి చేయడంతో రెండు జీవాలు చనిపోయాయి.

Update: 2021-02-27 02:42 GMT

ఫైల్ ఇమేజ్


కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మ‌ళ్లీ పులుల దాడులు ఆగడం లేదు. ఈ క్ర‌మంలో మన‌షులు - పులుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ మొద‌లైంది. జిల్లా అడవుల్లోకి పులులు తిరిగి రావ‌డంతో సంతోషప‌డ్డ గిరిజ‌న బిడ్డ‌లకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ‌లేదు. ఎందుకంటే ఆ పులులు మ‌న‌షులు, జీవాలపై కూడా దాడి చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు మొత్తం 50 ప‌శువుల‌ను పులులు దాడి చేసి చంపేశాయి.

తాజాగా కుమరం భీం ఆసిఫాబాద్‌జిల్లా బెజ్జూరు మండలం కుంటలమానేపల్లికి చెందిన ముగ్గురు కాపర్లు గురువారం పశువులను మేతకు తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో మందపై పులి దాడి చేసి ఒక ఆవు, ఎద్దును చంపేసింది. బె జ్జూరు రేంజ్‌ అటవీ అధికారు లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పెద్దపులి పంట చేలలో సంచరిస్తున్నందున పశువులను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లొద్దని గ్రామస్థులకు సూచించారు. అడవుల‌కు స‌మీపంలో ఉన్న నివాసాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పంట పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు ఇబ్బంది ప‌డుతున్నారు. గొర్రెలు, ప‌శువుల కాప‌ర్లు కూడా జంకుతున్నారు.

మ‌హారాష్ర్ట‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టాల నుంచి స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు గ‌త‌కొంత కాలంగా పులులు తిరిగి వ‌స్తున్నాయి. మూడు ద‌శాబ్దాల తర్వాత పులులు మ‌ళ్లీ అడ‌విలో అల‌జ‌డి చేస్తూ మూగ జీవాల‌పై దాడి చేస్తున్నాయి. మ‌న‌షుల‌పై దాడి చేయ‌ని పులులు ఇప్పుడు వారిపై కూడా దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News