TRS: టీఆర్‌ఎస్‌లో అధ్యక్ష పదవికి నామినేషన్లు
TRS: ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్ ప్రక్రియ
TRS: గులాబీ పార్టీ ఇరవై ఏళ్ల పండగకు సిద్ధమవుతోంది. సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీలు పూర్తి చేసుకుని మంచి స్పీడ్‌లో ఉన్న కారు పార్టీ. అధ్యక్షుడి ఎన్నికకు ఏర్పాట్లు చేసుకుంటోంది. హైదారాబాద్‌లో ప్లీనరి నిర్వహించి ఆ తర్వాత వరంగల్లో విజయ గర్జన సభకు గులాబీ శ్రేణులు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కిన తరుణంలో టిఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు.
ఈ నెల 17 న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 22దాకా నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. 23 న స్కృట్‌నీ ఉంటుంది. 24 న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. 25 న జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. అదే రోజు పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. 25న అధ్యక్షుడి ఆద్వర్యంలో hitexలో ప్లీనరీ జరుగుతుంది. ప్లీనరీకి పాసులున్నవారికే అనుమతిస్తారు. 2019లో పార్లమెంట్ ఎన్నికలు కారణంగా, 2020, 21లలో కరోనా కారణంగా ప్లీనరీ నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది.
ఈనెల 17న టీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల సమావేశం తెలంగాణ భవన్‌లో జరుగుతుంది. అక్టోబర్ 27న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ద్విదశాబ్ది సభ సన్నాహక సమావేశం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నవంబర్ 15న వరంగల్ లో పార్టీ ద్విదశాబ్ది విజయగర్జన సభ భారీగా నిర్వహించాలని సిద్ధమవుతున్నారు.
హెచ్ఐసీసీలో జరిగే క్లీనర్ ఈ సమావేశానికి 14,000 మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. పార్టీ కేడర్ ఏ విధంగా పని చేయాలి. ఉద్యమ కాలం నుంచి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలకు ఏ విధంగా పార్టీ అండగా నిలబడుతుంది అనేది ప్లీనరీ వేదికగా కెసిఆర్ వివరించనున్నారు.