MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు
MLC Kavitha: బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా.. విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం ఆదేశం
MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా.. విచారణ జరపాలని ట్రయల్ కోర్టును సుప్రీం ఆదేశించింది. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడీ తనను అరెస్ట్ చేసిందని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.
గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు రాకుండానే.. ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ఈడీ చర్యలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని… ఈ కేసులో తన అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు. అయితే.. కవిత తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.