ఎంపీ అరవింద్‌కు నిరసన సెగ.. పసుపు బోర్డు హామీ ఏమైందంటూ..
Tadla Rampur: ఎంపీ అర్వింద్‌కు నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్‌లో చేదు అనుభవం ఎదురైంది.
Tadla Rampur: ఎంపీ అర్వింద్‌కు నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్‌లో చేదు అనుభవం ఎదురైంది. పసుపు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌ను అడ్డుకున్నారు. బాండ్‌పేపర్లు పట్టుకొని పసుపుబోర్డు ఏమైందని నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాళ్ల రాంపూర్ సొసైటీలో జరిగిన అక్రమాలపై ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు అర్వింద్ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు, పసుపు రైతులు అర్వింద్‌ను అడ్డుకొని నినాదాలు చేశారు.
ఈక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కలగజేసుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే తాళ్ల రాంపూర్ సొసైటీలో 20కోట్ల రైతుల సొమ్మును కాజేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఈ 20కోట్ల కుంభకోణంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వాటా ఎంత అంటూ ఆయన ప్రశ్నించారు.