తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!
Heavy Rainfall In Telangana : రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు వీపరితంగా కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఆ వర్షాలు కూడా మరో రెండు రోజుల పాటుగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rainfall In Telangana : రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు వీపరితంగా కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఆ వర్షాలు కూడా మరో రెండు రోజుల పాటుగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీనితో ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రోజు ఉదయం 6:30 నుండి 7:30 కాకినాడకు 25 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది... ఇది తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణిస్తోంది. దీనితో రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది. అనంతరం తదుపరి 12 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుందని హైదరాబాదు వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు.
ఈ వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న డం వల్ల తెలంగాణ మీదుగా వెళ్లనుంది... దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు ,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... ఇక ఈరోజు కోస్తాంధ్రలో ప్రత్యేకించి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది..
అటు కోస్తా తీరం వెంబడి గాలుల వేగం క్రమంగా తగ్గుతుంది... రాగల మూడు గంటలపాటు గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది... దీని ప్రభావం ఎక్కువగా ఈరోజు తెలంగాణలో ఉంటుంది. రేపు క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంది.. ఈ వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... ఇది పశ్చిమ దిశలో ప్రయాణిస్తున్న పశ్చిమ మహారాష్ట్ర మరట్వడ గుండా వెళ్లనుంది..