న్యూ ఇయర్ వేడుకల వేళ అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు.. రంగంలోకి దిగిన రెండు వేలకుపైగా ట్రాఫిక్ పోలీసులు

New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో మందుబాబులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు.

Update: 2021-12-31 08:17 GMT

న్యూ ఇయర్ వేడుకల వేళ అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు.. రంగంలోకి దిగిన రెండు వేలకుపైగా ట్రాఫిక్ పోలీసులు 

New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో మందుబాబులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. మందేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తాట తీస్తామన్నారు. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ హంగామా మొదలు కానున్న వేళ.. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి ప్రణాళికలు చేపట్టారు.? వాచ్ దిస్ స్టోరీ.

ప్రభుత్వ ఆంక్షలతో భాగ్యనగర యువత కొత్త సంవత్సరానికి వెల్‌కమె చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీనికి తగ్గట్టుగానే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మాదాపూర్, కూకట్‌పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఏమాత్రం అతిక్రమించినా సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. ప్రధానంగా నిర్ణీత సమయానికంటే ఒక్క క్షణం ఎక్కవగా పబ్స్‌, బార్స్ నడిపినా కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పరిధిలో పెట్రోలింగ్, బ్లూ కోర్డ్స్, ఇతర సిబ్బంది సాయంత్రం నుంచే అలర్ట్‌గా ఉంటారని తెలిపారు.

మరోవైపు.. సైబరాబాద్ పరిధిలో ఇటీవలి కాలంలో రహ దారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మద్యం మత్తులో ర్యాష్ ‌డ్రైవింగ్‌లతో నిత్యం ప్రమాదాలు కామన్‌ అయిపోయాయి. ఇక.. న్యూ ఇయర్ అంటే ఆ హంగామా మామూలుగా ఉండదు. ఈ నేపధ్యంలోనే రెండు వేలకు పైగా ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని కీలక ఫ్లైఓవర్లు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకూ క్లోజ్ చేయనున్నారు. రోజువారి డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులతో పాటు అదనంగా స్పాట్స్ గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరించారు.

మొత్తంగా ఈ న్యూ ఇయర్‌ వేడుకలు జీరో యాక్సిడెంట్‌ డేగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని తమకు సహకరించాల్సిందిగా హైదరాబాద్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Tags:    

Similar News