Khammam: సకల సౌకర్యాలతో కొత్త బస్టాండ్ రెడీ...
Khammam: హైటెక్ హంగులతో, సకల సౌకర్యాలతో కొత్త బస్టాండ్ రెడీ అయ్యింది
Khammam: ఖమ్మం పట్టణానికి కొత్త కళ వచ్చింది. హైటెక్ హంగులతో, సకల సౌకర్యాలతో కొత్త బస్టాండ్ రెడీ అయ్యింది. బస్టాండ్‌లో కాలు పెట్టిన ప్రయాణికులకు కొత్త అనుభూతి కలింగించేలా బస్టాండ్‌ను డిజైన్ చేశారు. ఈ నయా బస్టాండ్‌ను మార్చి 1న ప్రారంభిచేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద బస్టాండ్‌గా ఖమ్మం కొత్త బస్టాండ్ కితాబు అందుకుంటోంది.
ఖమ్మం బైపాస్‌రోడ్డులో ఆధునాతన బస్టాండ్ సిద్ధమైంది. మార్చి 1న ఈ బస్టాండ్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ బస్టాండ్‌ను తలపించేలా..ఏడు ఎకరాల స్థలంలో రూ.25కోట్ల వ్యయంతో 30 ప్లాట్‌ఫారాలతో బస్టాండ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌తో పాటు విశ్రాంతి గదులు, కొరియర్ స్టాండ్, ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్ల పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు.
కొత్త బస్టాండ్ ఓపెన్ అవ్వగానే.. మయూరి సెంటర్‌లో ఉన్న పాత బస్టాండ్ గేట్లకు తాళాలు పడనున్నాయి. కొత్త బస్టాండ్ సర్వీసులపై ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్,ఒడిస్సా, కర్ణాటక తదితర పొరుగురాష్ట్రాలతో పాటు పొరుగుజిల్లాల బస్సుల రాకపోకలు మార్చి 1 నుంచి ఇక్కడినుంచే జరుగుతాయని చెబుతున్నారు అధికారులు.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడెకరాల స్థలంలో 12 ప్లాట్‌ఫామ్‌లతో ఇప్పటి పాత బస్టాండ్‌ను నిర్మించారు. నగర విస్తరణ, బస్టాండ్ చుట్టూ వెలసిన వ్యాపారాలు, ఆస్పత్రుల కారణంగా రద్దీ తీవ్రతరమైంది. దీంతో బస్సుల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.