TSSPDCL: కరెంట్‌ బిల్‌ వినియోగదారుడే తీసే విధంగా ఓ కొత్త యాప్‌..

TSSPDCL: కరెంట్‌ బిల్‌ వినియోగదారుడే తీసే విధంగా ఓ కొత్త యాప్‌ రానుంది.

Update: 2021-05-21 12:05 GMT

TSSPDCL: కరెంట్‌ బిల్‌ వినియోగదారుడే తీసే విధంగా ఓ కొత్త యాప్‌..

TSSPDCL: కరెంట్‌ బిల్‌ వినియోగదారుడే తీసే విధంగా ఓ కొత్త యాప్‌ రానుంది. అంతేకాదు చెల్లింపులు సైతం అందులోనే చేసే విధంగా యాప్‌ రూపుదిద్దుకోంటుంది. అవును ఈ నూతన యాప్‌ను TSSPDCL తొందరిలోనే అమలులోకి తీసుకురానుంది.

విద్యుత్‌ మీటర్‌లో రీడింగ్‌ నమోదు దానికి చెల్లించవలసిన బిల్లు ఇకపై వినియోగదారులే స్వయంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు కస్టమర్లే స్వయంగా బిల్‌ పే చేయొచ్చు. అవును దీనికి సంబంధించిన యాప్‌ను TSSPDCL అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ యాప్‌ను విద్యుత్‌ సాంకేతిక అధికారులు ఉపయోగిస్తుండగా, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను TSSPDCL అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

కోవిడ్‌ కారణంగా గతేడాది కరెంట్‌ బిల్‌ వేసే సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కొన్ని కారణాల వల్ల ఒకేసారి రెండు బిల్లులు రావడంతో వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో ఈఏడాది అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు TSSPDCL ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇక తమ సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకే ఈ నూతన యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

మీటర్‌ రీడింగ్‌ తెలుసుకునేందుకు TSSPDCL, భారత్‌ సెల్ఫ్‌ రీడింగ్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత యాప్‌లోకి ఎంటర్‌ అవ్వగానే మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌తోపాటు విద్యుత్‌ మీటర్‌ USN నెంబర్‌ టైప్‌ చేయాలి. ఆవెంటనే WH స్కాన్‌ కనిపిస్తుంది. ఇక స్కాన్‌ చేయగానే మీటర్‌ రీడింగ్‌ ఫోటో గ్రాఫ్‌ వస్తుంది. ఆతర్వాత మీటర్‌ రీడింగ్‌ కనిపించడమేగాక మీటర్‌ నెంబర్‌, కేటగిరి, ఫేజ్‌, ఓపెనింగ్‌ రీడింగ్‌, గతనెల బిల్‌ కనిపిస్తుంది. చివరకు పే ఆప్షన్‌ ప్రెస్‌ చేయడంతో కరెంట్‌ బిల్‌ పే అవుతుంది.

ఇక ఒకవేళ యాప్‌ను సరిగ్గా ఆపరేట్‌ చేయకపోతే TSSPDCL మరో వెసులుబాటు కల్పించింది. అదేటంటే విద్యుత్‌ మీటర్‌ ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. అవును ఆయాప్‌ ఆటోమేటిక్‌గా మీటర్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేసుకుని బిల్‌ డీటేల్స్‌ను చూపిస్తోంది. ఇంకేముంది యధావిధిగా బిల్‌ చూసుకుని వినియోగదారుడు నగదు చెల్లింపుచేయొచ్చు.

Full View


Tags:    

Similar News