Neelam Madhu: బీఎస్పీకి నీలం మధు రాజీనామా…15న గాంధీభవనన్లో కాంగ్రెస్లో చేరిక..
Neelam Madhu: ప్రజాపాలనలో భాగస్వామ్యం అవుతా
Neelam Madhu: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఎస్పీ నియోజకవర్గ నేత నీలం మధు కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ మేరకు ఆయన బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మరియు కార్యకర్తల అభిప్రాయం మేరకే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజా పాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 15న గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు నీలం మధు ప్రకటన చేశారు.