National Green Tribunal about Secretariat Demolition: సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం.. ఎన్‌జీటీ స్పష్టం..
National Green Tribunal about Secretariat Demolition: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
National Green Tribunal about Secretariat Demolition: జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ సచివాలయ భవనాల కూల్చివేత, నూతన సెక్రటేరియట్ నిర్మాణంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఇందులో భాగంగానే సోమవారం ఎన్‌జీటీ విచారన చేసి సచివాలయం కూల్చివేత అంశం జోలికి వెళ్లబోమని స్పష్టం చేసింది. ఈ విచారణంలో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. అంతే కాక కూల్చివేత వల్ల ఏర్పడే వ్యర్థాల నిర్వహణపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఎన్‌జీటీ ఉత్తర్వులిచ్చింది.
పీసీబీ, ఐఐటీ హైదరబాద్‌కు చెందిన నిపుణులతో ఎన్జీటీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. నోడల్ ఏజెన్సీగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఉంటుంది. ఇకపోతే న్యాయవాదులు శ్రావణ్ కుమార్, సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని, ఆగ్నేయ్ రేవంత్ రెడ్డి తరఫు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. ఇక పోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), స్టేట్ లెవల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) పాత భవనాలను కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని గతంలోనే హైకోర్టుకు వెల్లడించాయి.
ఇక తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం జూలై 6వ తేది అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారులు ఆరోజు అర్థరాత్రి నుంచే కూల్చివేతకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను భారీగా మొహరించి ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, మింట్ కాపౌండ్ సెక్రెటరేట్ దారులను మూసివేశారు. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సచివాలయం. నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది.