రూ.400 కోట్లతో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో.. పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు
* ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
Begumpet Airport: తెలంగాణకు మోడీ సర్కార్ మరో కానుకను అందించింది. 400 కోట్ల రూపాయలతో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో మొదటిసారిగా 'గృహ-5' ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో.. వివిధ రకాల పరిశోధనా సౌకర్యాలను కల్పించనున్నారు. ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పౌర విమానయాన పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. 2023 డిసెంబర్‌లోగా పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.