Nama Nageswara Rao: తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్రానికి చిన్నచూపు

Nama Nageswara Rao: నిధులు ఇవ్వొద్దు.. మైన్స్ ఉండొద్దని కేంద్రం చూస్తోంది -నామా

Update: 2022-12-07 08:24 GMT

Nama Nageswara Rao: తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్రానికి చిన్నచూపు

Nama Nageswara Rao: సింగరేణి కాలనీస్ తెలంగాణకు గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారని ఎంపీ నామా చెప్పారు. సింగరేణిని ప్రయివేట్ పరం చేయమంటూ ప్రధాని గత నవంబర్‌లో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారని, కానీ నేడు పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు.. నాలుగు బ్లాకులు ప్రైవేట్‌పరం పరం చేస్తున్నామంటూ సమాధానం ఇచ్చారని చెప్పారు ఎంపీ నామా.

తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్రానికి చిన్నచూపు ఉందన్నారాయన... తెలంగాణకు నిధులు ఇవ్వొద్దు.. మైన్స్ ఉండొద్దని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేశారని ఎంపీ నామా నాగేశ్వర్ రావు దుయ్యబట్టారు. సింగరేణి కాలనీని తెలంగాణ రాష్ట్రానికి వదిలేయాలని ఎంపీ నామా కోరారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 49 శాతం వాటా కూడా తామే తీసుకుంటామని చెప్పారు నామా నాగేశ్వర్ రావు.. దేశవ్యాప్తంగా 38 బ్లాకులు అమ్ముతున్నట్లు పార్లమెంట్‌లో మంత్రి చెప్పారని ఎంపీ నామా అన్నారు. 

Tags:    

Similar News