Nagarjuna About N Convention Centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

Nagarjuna About N Convention Centre: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగార్జున స్పందన

Update: 2024-08-24 07:43 GMT

Nagarjuna About N Convention Centre Demolish: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కోర్టు స్టే ఇచ్చిన అంశంపై ప్రభుత్వం, హైడ్రా నిర్ణయం తీసుకుని కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అని అన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను అడ్డుకుంటూ గతంలోనే కోర్టు నుండి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాం. కోర్టు కేసులకు విరుద్ధంగా N కన్వెన్షన్‌ సెంటర్‌ని కూల్చివేయడం బాధాకరం. మా పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం కోసం, కొన్ని వాస్తవాలను అందరి ముందు బయటపెట్టడం అవసరం అనిపించి ఈ ప్రకటన చేస్తున్నాను. అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి మేము ఎటువంటి కబ్జాలు చేపట్టలేదని అందరికి చెప్పాలని భావించాను అంటూ అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమి పట్టా భూమి. అందులో ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ ఆక్రమణకు గురవలేదు. N కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం. కూల్చివేయాల్సిందిగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన అక్రమ నోటీసులపై కోర్టు స్టే కూడా ఇచ్చింది అని పేర్కొన్న నాగార్జున.. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అని ఆరోపించారు.

ఈరోజు ఉదయం N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడానికి ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఒకవేళ కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి ఉంటే అది నేనే కూల్చివేసే ఉండేవాడిని. కానీ ఇలా అసలు వాస్తవాలతో సంబంధం లేకుండా వచ్చి కూల్చివేయడం వల్ల మేమే ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా అని నాగార్జున ఆందోళన వ్యక్తంచేశారు. హైడ్రా అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలపై తాము న్యాయస్థానంలో పోరాడుతామని.. కోర్టులపై తమకు నమ్మకం ఉందని నాగార్జున స్పష్టంచేశారు.

N Convention Demolish : హీరో నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న హైడ్రా

Tags:    

Similar News