Munugode Bypoll: రేపే మునుగోడు బైపోల్.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ
Munugode Bypoll: రేపు ఉ.7 గం.ల నుంచి సా.6 గం.ల వరకు పోలింగ్
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక నిర్వహణలో అత్యంతకీలకమైన పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. చండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంనుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను., పోలింగ్ నిర్వహణ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ప్రిసైడింగ్ అధికారులు ఇవాళ సాయంత్రానికి చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు.
*మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు
*మునుగోడులో మొత్తం ఓటర్లు: 2,41,855
*పురుషులు: 1,21,720, మహిళలు: 1,20,128
*పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు: 5,686
*మొత్తం పోలింగ్ కేంద్రాలు: 298
*అర్బన్ పరిధిలో - 35, రూరల్ పరిధిలో - 263
*పోలింగ్ సిబ్బంది: 1192, అదనంగా మరో 300
*అందుబాటులో 199 మంది మైక్రో అబ్జర్వర్స్