ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

* రాష్ట్రములో పలు ప్రదేశాలలో ఘనంగా జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకలు * భక్తులతో కిటకిటలడిన ఆలయాలు.. * భక్తి శ్రేద్దలతో పూజలు చేసుకున్న భక్తులు.

Update: 2020-12-25 11:54 GMT

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అన్ని దేవాలయాల్లో విష్ణుమూర్తిని ఉత్తరద్వారం నుంచి దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయా ఆలయ అధికారులకు కోవిడ్ నిబంధనలు అననుసరించి ఏర్పాట్లను చేశారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

 ఆలయాలకు పోటెత్తిన భక్తులు..ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా ఆలయాలకు చేరుకున్న భక్తులు..

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

 వరంగల్ లో గీత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గీత జయంతి సందర్భంగా.. శ్రీకృష్ణ మందిరాలలో ఉదయం నుంచీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. గీత పారాయణం, సత్సాంగ్ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి, గీత జయంతి కలిసి రావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తరు.

హైదరాబాద్ లో..

భాగ్యనగర ఆలయాల్లో భక్తులతో ఉదయం నుండి కిటకిటలాడయి.. సీతాఫలమండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం దాదాపు 2 కిలో మీటర్ల భక్తులు లైన్లో వేచి ఉంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.. ప్రత్యేక క్యూ లైన్స్ కూడా వి . ఐ .పి కోసం ఏర్పాటు చేశారు.. జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

కర్నూల్ జిల్లలో .. 

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సందడి నెలకొంది. వేకువజామునే భక్తులు భారీ ఎత్తున ఆలయాలకు తరలి వచ్చారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసించే నేపథ్యంలో ఆలయాలు హరి నామస్మరణతో మారుమోగాయి. 

గుంటూరు జిల్లాలో..

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గుంటూరులోని ఆలయాలు హరి నామస్మరణతో మార్మోగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. నగరంలోని బృందావన గార్డెన్స్ తో వెంకటేశ్వర ఆలయంతో పాటు.. జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.

Tags:    

Similar News