Telangana: ఆ గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటలు దాటితే చీకటే.. అచ్చం 'క' సినిమాలోలా..!

Kodurupaka: ఉదయం ఏడున్నర దాటితే కాని సూర్యకిరణాలు ఆ గ్రామాన్ని తాకవు... మధ్యాహ్నం మూడు దాటిందంటే చాలు.. నీడ ఆవరిస్తుంది..

Update: 2024-11-25 04:35 GMT

Telangana: ఆ గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటలు దాటితే చీకటే.. అచ్చం 'క' సినిమాలోలా..!

Kodurupaka: ఉదయం ఏడున్నర దాటితే కాని సూర్యకిరణాలు ఆ గ్రామాన్ని తాకవు... మధ్యాహ్నం మూడు దాటిందంటే చాలు.. నీడ ఆవరిస్తుంది.. ఇదేదో విదేశాల్లో అనుకుంటే పొరపాటే... అచ్చంగా తెలంగాణలోని ఓ పల్లె పరిస్దితి ఇది... ఇదొక్కటే కాదు మరో వింత కూడా ఆ గ్రామంలో ఆసక్తిగా మారింది.. ఇంతకీ ఈ గ్రామానికి ఎందుకీ ప్రత్యేకత.

అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇంకా కాపాడుకుంటున్న ఈ గ్రామం పేరు కొదురుపాక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్న ఈ గ్రామానికి మరో పేరు కూడా ఉంది.. అదే మూడు జాముల కొదరుపాక.... ఇప్పుడు ఈ గ్రామం మరోసారి చర్చల్లోకి వచ్చింది. కారణం ఇటీవల 'క' అనే సినిమాలో ఇక్కడున్న గ్రామ పరిస్థితిని కలిగి ఉంటుంది.. అందుకు మరోసారి ఈ మూడు జాముల కొదురుపాక చర్చల్లోకి వచ్చింది. మధ్యాహహ్నం మూడు దాటిందంటే ఇళ్లల్లో చీకట్లు కమ్ముకుంటాయి... సరిగ్గా చెప్పాలంటే.. ఇతర ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకు ఉండే వాతావరణం ఈ గ్రామంలో మాత్రం ఓ గంటన్నర ముందే కనబడతాయి.. అందుకే ఈ కొదురుపాక గ్రామం సంథింగ్ స్పెషల్.

ఇలాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఈ గ్రామం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఈ గ్రామం గురించి ఎంతో మంది ఆన్ లైన్‌లో సెర్చ్ చేసే పరిస్థితి వచ్చింది... సాధారణంగా అన్ని గ్రామాలు నాలుగు జాముల కాలాన్ని అనుభవిస్తూంటే.. కొదురుపాక గ్రామస్తులు మాత్రం మూడు జాముల కాలాన్నే వెళ్లదీస్తుంది. అందుకు ఈ గ్రామానికి కొన్నేళ్ల క్రిందటే మూడు జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది.

ఇటీవల విడుదలైన 'క' అనే సినిమాలో ఓ గ్రామంలో ఇటువంటి పరిస్థితులనే చూపించారు.. అందుకే ఇప్పుడు మరోసారి ఈ మూడు జాముల కొదురుపాక ట్రెండింగ్‌గా మారింది.. అయితే సినిమాలో చెప్పినట్టుగా మరీ మూడు గంటలకే చీకటి పడకపోయినా.. మూడు జాముల కొదురుపాకలో కూడా సాయంత్రం నాలుగు గంటలు దాటితే ఇళ్లలో చీకటి అలుముకుంటాయి.

అయితే ఈ గ్రామానికి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడడానికి ఓ కారణం ఉంది... చుట్టూ నాలుగు గుట్టల మధ్య ఈ గ్రామం ఏర్పడింది. అలా గ్రామం చుట్టూ నాలుగు దిక్కుల్లోనూ ఎత్తైన గుట్టలు ఉండడమే ఈ ఏర్లీ ఈవినింగ్స్‌కి‌ కారణం... పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట అనే నాలుగు గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉంది. ఈ ఎత్తయిన గుట్టల కారణంగా కొదురుపాకలో ఆలస్యంగా సూర్యోదయం, ముందుగానే సూర్యాస్తమయం జరుగుతుంటాయి. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది.

ఈ మూడు జాముల కొదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది.. ఈ గ్రామానికి పశ్చిమాన ఉన్న రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండగ వేళ జరిగే వేడుకకు.. దేవునిపల్లి నుంచి నంబులాద్రి నరసింహ స్వామిని ఈ దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయంలో ఒకరోజు వైభవంగా ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునిపల్లికి చేరుస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తుండడంతో.. ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు మూడు జాముల కొదురుపాక గ్రామస్తులు.

Tags:    

Similar News