మధ్య బంగాళాఖాతంలో సుమారు 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య మహారాష్ట్రతో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరానికి దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత అది బలపడి వాయుగుండముగా మారి వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అన్నారు.