KTR: అదానీ,అంబానీలకు 14 లక్షల కోట్లు మోడీ దోచిపెట్టారు
KTR: కరోనా కాలంలో కార్మికులను మోడీ పట్టించుకోలేదు
KTR: బడా కార్పొరేట్లు అయినా అదానీ, అంబానీలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేయలేదని .. ఇదే బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే.. రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. 2019 మార్చిలో కరోనా వచ్చిందని... అప్పుడు దేశమంతా అల్లకల్లోలమైందన్నారు. ఆనాడు మోదీ కార్మికులను పట్టించుకోలేదని... రైళ్లు, బస్సులు పెట్టమంటే చలనం లేనట్లు ప్రవర్తించారని కేటీఆర్ ఆరోపించారు. కార్మికులను, కర్షకులను మోదీ చావగొట్టారని కేటీఆర్ పేర్కొన్నారు.