Kavitha: మెడికో ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ
Kavitha: ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది
Kavitha: మెడికో ప్రీతి తల్లితండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రీతి మృతి చెందిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యానని లేఖలో వెల్లడించారు. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్నానని.. పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.