MLC Kavitha: 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్.. తిహాడ్ జైలుకు కవిత
MLC Kavitha: మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ...తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.. ఇక ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది.
అంతకుముందు.. కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో..ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో..మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు. కవితను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ కీలక అంశాలను ప్రస్తావించింది. కవిత అత్యంత ప్రభావవంతమైన నాయకురాలని..ఈ కేసులో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు..సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది. భవిష్యత్ లో విచారణకు ఆటంకం కలిగే అవకాశముందని పేర్కొంది.. లిక్కర్ కేసు విచారణలో కవితను కిన్ పింగ్ గా గుర్తించామన్న ఈడీ.. ఈ వ్యవహారంలో కవిత కీలకమైన కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చింది. కవిత పాత్రపై మరింత పరిశోధన చేయాల్సి ఉన్నందునా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కోర్టులో విచారణకు హాజరయ్యే సమయంలో.. కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేస్ అంటూ కామెంట్స్ చేశారు. తాను అప్రూవర్ గా మారనని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు కవిత.