MLC Kavitha: రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా అన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది
MLC Kavitha: బయట లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేయడం బీజేపీ పని
MLC Kavitha: బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా అన్నట్టు బీజేపీ పని ఉందని విమర్శించారు. బయట లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేయడం వాళ్ల పని అని, బీజేపీలో చేరకపోతే ఐటీ, ఈడీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలను వదలకుండా ఐటీ, ఈడీలతో సోదాలు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని సంస్థలు వచ్చి దాడులు నిర్వహించినా.. భయపడేది లేదని తేల్చి చెప్పారు
బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈడీ ఐటీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేసిన వారే భయ పడతారని అన్నారు. మేం విచారణకు హాజరు కావాలి కానీ... బీజేపీ వాళ్లు రారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.