MLC Kavitha Arrest: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు..
MLC Kavitha Arrest: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలను కుదిపేసే ఘటన చోటు చేసుకుంది.
MLC Kavitha Arrest: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలను కుదిపేసే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం కేసులో హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఈడీ.. సోదాల అనంతరం అరెస్టు నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకుంది. కవితకు సంబంధించిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. రాత్రి 8:45 గంటల ఫ్లైట్ కు టికెట్లు బుక్ చేసిన ఈడీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కవితను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. ఇలా సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడెన్‌గా సోదాలు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.