MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల బిల్లు వ్యక్తిగతం కాదు.. ఎన్నికల తర్వాత జంతర్ మంతర్ వద్ద మరోసారి ధర్నా
MLC Kavitha: దయచేసి అన్ని పార్టీలు సహకరించండి
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని 70కోట్ల మంది మహిళల సమస్య అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. 2010 లో లోక్ సభలో పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 అయినా రాజ్యసభకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత మరోసారి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని కవిత ప్రకటించారు. కేంద్రంలోని మహిళా మంత్రులు, సోనియాకు లేఖలు ఇస్తామని వెల్లడించారు.