MLC Kavitha: కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు ఇవాళ ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో.. ఇవాళ్టి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. బేగంపేట నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది.
ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఢిల్లీ వెళ్లిన కవిత విచారణకు మాత్రం హాజరుకాలేదు. తన ప్రతినిధిగా సోమ భరత్ కుమార్‌కు ఈడీ కోరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. 20న విచారణకు రావాలని సూచించింది.
కాగా ఇవాల్టీ విచారణలో భాగంగా.. కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో పాటుగా ప్రశ్నించాలని భావిస్తోంది ఈడీ. అయితే కవిత విచారణపై క్లారిటీ రానుంది.