Kavitha: జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించాం

Kavitha: మోడీ కూడా జర్నలిస్టులకు రూ.100 కోట్లు కేటాయించాలి

Update: 2023-01-08 10:13 GMT

Kavitha: జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించాం

Kavitha: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జర్నలిస్టుల ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాలు మూడ్రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడి ఆమె మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదన్నారు. సీఎం కేసీఆర్‌ 300 మంది జర్నలిస్టులతో ప్రెస్‌మీట్‌లు పెట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారని తెలిపారు. దేశంలో ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం కనుమరుగైందన్నారు. తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు కేటాయించామన్న కవిత దమ్ముంటే మోడీ కూడా జర్నలిస్టులకు 100 కోట్లు కేటాయించాలన్నారు.

Tags:    

Similar News