MLC Kavitha: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్

MLC Kavitha: BRS హయాంలో 20వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చాం

Update: 2024-02-08 06:35 GMT

MLC Kavitha: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్

MLC Kavitha: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణిలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలిచ్చామన్నారు. 20 వేల ఉద్యోగాలు ఇచ్చినా ఏనాడు కేసీఆర్ స్వయంగా వెళ్లి నియామక పత్రాలు ఇవ్వలేదన్నారు. అక్కడ ఉండే మేనేజర్ల స్థాయి ఆపీసర్ల చేతే నియామక పత్రాలు ఇప్పించారన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 400 ఉద్యోగాలిచ్చామని చెబుతూ వారందర్ని హైదరాబాద్ పిలిపించుకొని నియామక పత్రాలిచ్చారన్నారు. ఒక మేనేజర్ స్థాయి వ్యక్తి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేస్తున్నారని కవిత విమర్శించారు.

రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మె్ల్సీ కవిత ఆరోపించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. విద్యుత్ శాఖలో ఎక్కువ మంది ఆంధ్రాప్రాంతానికి చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారని అందుకే కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నారు. 

Tags:    

Similar News