MLC Kavitha: తన పాత ఫోన్లతో.. ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: లిక్కర్ స్కాంలో వరుసగా రెండోరోజు విచారణ
MLC Kavitha: లిక్కర్ స్కాంలో వరుసగా రెండో రోజు విచారణకు హాజరయ్యారు కవిత. న్యాయనిపుణులతో చర్చించిన కవిత..కాసేపటి క్రితమే ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత తన పాత మొబైల్ ఫోన్లను మీడియాకు చూపింది. కవిత ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించడంతో.. తన పాత ఫోన్లను తీసుకుని విచారణకు వెళ్లారు కవిత.
లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత.. ఇవాళ ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ రాశారు. తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడాన్ని తప్పుబట్టారు. కనీసం సమన్లు ఇవ్వకుండా ఏ పరిస్థితుల్లో ఈడీ ఆరోపణలు చేసిందని ప్రశ్నించారు కవిత. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నా గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని తెలిపారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకుంటే గోప్యతకు భంగం కలగదా అని ప్రశ్నించిన కవిత.. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని ఈడీ తుంగలో తొక్కి వ్యవహరించడం దురదృష్టకరం అని లేఖలో పేర్కొన్నారు. తన ప్రతిష్టను, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.