Choppadandi: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం చొప్పదండి, రామడుగు మండలాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు, చేస్తుందని తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ఏ రాష్ట్రంలో కూడా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా రైతు కనుక రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.