Raja Singh: హైదరాబాద్‌లోనూ ఢిల్లీ తరహా కోచింగ్ సెంటర్‌లు
Raja Singh: హైదరాబాద్‌లో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.
Raja Singh: హైదరాబాద్‌లో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో తెలంగాణ యువతి చనిపోయిందని.. అందుకు కారణం అక్రమ నిర్మాణాలే అన్నారు. తెలంగాణలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండానే చాలా కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్నారన్నారు. GHMC పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్‌పై జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.