Lasya Nanditha: అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు
Lasya Nanditha: లాస్య మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
Lasya Nanditha: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై ఈ ప్రమాదం జరిగింది. నందిత మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. కాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్యనందిత భౌతికకాయం చేరుకోనుంది. ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి ఎమ్మెల్సీ కవిత చేరుకుని, ఆమెను పరామర్శించారు. అధికారిక లాంఛనాలతో లాస్యనందిత అంత్యక్రియలు జరపనున్నారు. సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెల్లవారుజామునే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, వేగం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు ముందు భాగం, ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి.