గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఇవాళ్టి నుంచి మంత్రి కేటీఆర్ ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారని ప్రభుత్వం విప్ బాల్క సుమన్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలో గందరగోళం నెలకొందని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలకు కామెడీ షోలా అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జనసేన అధినే పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్‌లో రాజకీయాలు చేయడం ఎంటో వారికే తెలియలని కామెంట్ చేశారు.
ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని సవాల్ చేశారు. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ వచ్చిందా..?. బీజేపీ, కాంగ్రెస్‌కు గ్రేటర్ ప్రజలు తగిన బుద్ది చెప్తారు. కిషన్‌రెడ్డి నిస్సహాయుడు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు అంటూ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.