Mission Bhagiratha: మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతం.. సిద్దిపేట జిల్లా మంగోల్ వద్ద ట్రయల్స్ ప్రారంభించిన మంత్రులు
Mission Bhagiratha: 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నీటి శుద్ధీకరణ ప్లాంట్
Mission Bhagiratha: మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు చేపట్టిన మిషన్ భాగీరథ కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆరు జిల్లాలకు తాగు నీటిని అందించనున్నారు. సిద్దిపేట జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్. నేడు మల్లన్నసాగర్ నుంచి ట్రయల్‌రన్‌ను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. CMO సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో పాటు కుకునూర్‌పల్లి మండలం మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల 12 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్లాంట్ రోజుకి 540 మిలియన్ లీటర్లను శుద్ధి చేయవచ్చు. దీంతో భవిష్యత్తులో మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు తాగు నీటి ఇబ్బందులు తగ్గనున్నాయి.