Kidnap Case: 3 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన మిస్సైన బాలుడు

Kidnap Case: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సినిమాను తలపించిన సంఘటన

Update: 2021-03-25 07:25 GMT

Representational Image

Kidnap Case: మూడేళ్ల వయస్సులో అదృశ్యమైన ఓ చిన్నోడు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షం అయ్యాడు. సినిమాలు సీరియళ్లలో కనిపించే అలాంటి దృశ్యం నిజ జీవితంలోను నిజమైంది. వినడానికి విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉన్నా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ బాలుడు కిడ్నాప్ మిస్టరీ మూడేళ్ల తర్వాత వీడింది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన గోపి-ఉమ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు గణేష్ 2018 ఏప్రిల్ 13న ఇంట్లో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. ఓ కిడ్నాపర్ బాబును హైదరాబాద్ కు చెందిన దంపతులకు అమ్మేశాడు. కిడ్నాప్ చేస్తన్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

రోజరోజుకు ఆశలు సన్నగిల్లి ఇక దేవునిపై భారం వేశారు. ఆ దేవుడే కిడ్నాపర్ రూపంలో వాళ్లింటికొచ్చాడు. ముషిరాబాద్ లో ఓ దంపతులకు లక్షన్నరకు బాలున్ని అమ్మేసినట్లు కిడ్నాపర్ ఒప్పుకుని వారికి సమాచారం ఇచ్చాడు. ఎట్టకేలకు బాబు ఆచూకి లభించి కన్నతల్లి ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బైపోతున్నారు.

కామారెడ్డి డ్రైవర్స్ కాలనీ ప్రాంతంలో ఉండే భార్యభర్తలు మరో మహిళతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని చిన్న పిల్లలను టార్గెట్ చేశారు. ఇలా కామారెడ్డిలోనే ముగ్గురు పిల్లలను అపహరించారు. ప్రస్తుతం ఆ కేసులన్నీ చేధించారు పోలీసులు. గణేష్ విషయంలో జరిగింది అద్బుతమో దేవుని మహిమో తెలియదు కానీ ఓ తల్లి మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అమ్మ ప్రేమ గెలిచింది.

Tags:    

Similar News