Minister Talsani Srinivas Yadav On Press Meet : కేంద్రం పై భవిష్యత్ లో యుద్ధమే జరుగుతుంది
Minister Talsani Srinivas Yadav On Press Meet : తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని. శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్రం పై భవిష్యత్ లో యుద్ధమే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. GST, వ్యవసాయ బిల్లు అంశాలలో టీఆరెస్ ఎంపీ లు పార్లమెంట్ లో పోరాడతారన్నారు. పార్లమెంట్ జరిగినన్ని రోజులు కలిసివచ్చే పార్టీలతో నిరసన చేస్తాం అని ఆయన అన్నారు. కరీంనగర్ లో ఎంపీగా గెలిచిన సంజయ్ హైదరాబాద్ లో కూర్చుంది పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఆయన గెలిచాక కరీంనగర్ కి ఏం చేసారో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ ఘనంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉండటంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులు ఎన్నడూ లేనంతగా సంతోషాన్ని పొందుతున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వస్తుందని ఎవరు కలలో కూడా ఊహించలేదనున్నారన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం సృష్టించినా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని ఆయన స్పష్టం చేసారు. కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని తెలిపారు. రెవెన్యూ శాఖలో అవినీతి అంతం చేసేందుకు విఆర్వో వ్యవస్థను రద్దు చేశామని స్పష్టం చేసారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కులవృత్తులకు అనేక సహకారం అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చామని గర్వించారు. గతంలో పని చేసిన ప్రభుత్వాలు చెప్పిన హామీలు కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేసారు. గాలి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని స్పష్టం చేసారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, రైతువేదికలు హరితహారం కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కట్టినన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దేశంలో ఎక్కడా నిర్మించలేదన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ను చూపించేందుకు నేనే భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లానన్నారు. దేశంలో ఎవరూ చేయలేని విధంగా విధంగా ధైర్యంగా ప్రతి పక్షాలను స్వయంగా తీసుకెళ్ళానని తెలిపారు. నేను ముందు నడుస్తుంటే వెనక విజ్ఞత లేని కామెంట్స్ చేశారన్నారు. అందుకే వారిని నేనే ఇక మీరు చూసింది చాలు లిస్ట్ పంపిస్తాను అని పంపించానన్నారు. పారిపోయారు అనే విజ్ఞత లేని వారిలా కామెంట్స్ నేను చేయనని ఆయన అన్నారు. రేపు మీడియాకి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లిస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. మీడియా వెళ్లి అవి నిజామా కాదా అని చుడాలని కోరారు.