Kadem Project : కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu On Heavy Rains : కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలతో పాటు ప్రాజెక్టు వద్ద చేపట్టిన చర్యలపై మంత్రి శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నారు.
Minister Sridhar Babu On Heavy Rains : కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలతో పాటు ప్రాజెక్టు వద్ద చేపట్టిన చర్యలపై మంత్రి శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున ఎవరూ గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు.