Sridhar Babu: ప్రజల వద్దకే పాలన వచ్చింది..

Sridhar Babu: అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

Update: 2023-12-28 09:21 GMT

Sridhar Babu: ప్రజల వద్దకే పాలన వచ్చింది..

Sridhar Babu: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజా పాలనను ప్రారంభించిందని శ్రీధర్ బాబు అన్నారు. సమాచారాన్ని సేకరించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఆయన..అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News