Seethakka: ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకులే కుట్ర చేశారు

Seethakka: ఆదిలాబాద్‌ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకుల కుట్ర పూరిత రాజకీయాలే కారణమని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క.

Update: 2024-06-08 06:56 GMT

Seethakka: ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకులే కుట్ర చేశారు

Seethakka: ఆదిలాబాద్‌ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకుల కుట్ర పూరిత రాజకీయాలే కారణమని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. వాస్తవానికి ఆదిలాబాద్​లో కాంగ్రెస్​ గెలిచేదని, కానీ తమ పార్టీలోనే కొంతమందికి ఎంపీ అభ్యర్థి నచ్చకపోవడంతోపాటు కొన్ని కుట్రలు జరిగాయని ఆరోపించారు. ఆదిలాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా శక్తి వంచన లేకుండా శాయశక్తులా కృషిచేశానని చెప్పారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లక్షా డెబ్భై వేల ఓట్లు వచ్చాయన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయన్నారు. నియోజకవర్గ ఓటమిపై సమీక్షించిన నేపథ్యంలో కొంతమంది నాయకుల వల్లే ఆ స్థానాన్ని కోల్పోయినట్లు తెలుస్తోందని తెలిపారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఎదగరని, మనస్ఫూర్తిగా పనిచేసే వారే భవిష్యత్తులో మంచి నేతలుగా ఎదుగుతారన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడే నేతలు పనిచేయాలి తప్ప.. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకులతో కుమ్మక్కై వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దని అన్నారు.

Tags:    

Similar News