Minister Seethakka: బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు.

Update: 2024-12-08 12:00 GMT

Minister Seethakka: బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్స్‌ ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీతక్క తెలిపారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్‌ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలని సూచించారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.

నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నన్ను అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. నా మనసును నొప్పించారని మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. నాకు చాలా బాధగా ఉందని అన్నారు. బండి సంజయ్ నన్ను నేరుగా కామెంట్స్ చేయాలన్నారు. కానీ క్యాబినెట్ అందరిని అనడం సరికాదన్నారు. బీజేపీ మద్దతుతో టీడీపీ నుండి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. వరంగల్, కరీంనగర్ పోరాటాల గడ్డ, బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. మన వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ బాధాకరమన్నారు. ఎన్‌కౌంటర్ లేని తెలంగాణ, శాంతి భద్రతల తెలంగాణనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు.

Tags:    

Similar News