ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Satyavati Rathore speak to officials : రాష్ట్రంలో ఎడతెరపిలేకుండు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు, జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.
Minister Satyavati Rathore speak to officials : రాష్ట్రంలో ఎడతెరపిలేకుండు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు, జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. భారీ వర్షాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం ఆమె ఫోన్లో మాట్లాడారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుకోసవాలని, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జాగ్రత్త వహించాలన్నారు. జిల్లాల్లో ఏదైనా అత్యవసర సాయం కోసం కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్భన్, ములుగు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యుత్ అధికారులు వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ వర్షాల వల్ల చెరువులు, ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతోందని ఆమె అన్నారు. చెరువులకు గండ్లు పడకుండా ప్రాజెక్టుల్లో నీటి లెవల్స్ నిర్వహించడం కోసం ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. రోడ్లు గుంతల పడి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు భారీగా ఉన్నందున ప్రజలు కూడా సహకరించాలని, అత్యవసరమైతేనే రోడ్లమీదకు వెళ్లాలని, ఏదైనా ప్రమాదం ఉన్నట్లు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా మంత్రిగా తాను మహబూబాబాద్లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చన్నవారు.
ఇక పోతే ఇటు ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకాయి. వరద ఉధృతితో మేడారం అమ్మవార్ల గద్దెలను జంపన్న వాగు నీరు తాకనుంది. ఇప్పటికే వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. దీంతో పోలీసులు పస్రా నుంచి మేడారానికి రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. వర్షపు నీరు ఇప్పటికే చిలుకల గుట్టను తాకి మేడారం గద్దెల వైపు భారీగా ప్రవహిస్తోంది. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో మొదటిసారి. ఇప్పటికే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఊరట్టం వద్ద భారీగా జంపన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తూ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది.